నీవు చేసిన ఉపకారములకు

 నీవు చేసిన ఉపకారములకు 

నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా... వేలాది పొట్టేల్లనా (2) ||నీవు చేసిన||

వేలాది నదులంత విస్తార తైలము 
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని 
నీకిచ్చినా చాలునా (2)                    ||ఏడాది||

మరణపాత్రుడనైయున్న నాకై 
మరణించితివ సిలువలో  (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన 
నడిపించుమో యేసయ్యా (2)            ||ఏడాది||

విరిగి నలిగిన బలి యాగముగను 
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము 
నిను వెంబడించెదను (2) ||ఏడాది||

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు 
నీకేమి చెల్లింతును  (2)
కపట నటనలు లేనట్టి హృదయాన్ని 
అర్పించినా చాలునా (2)                           ||ఏడాది||

Post a Comment

0 Comments