స్తుతించి నే పాడెదా - స్తోత్రగీతమును

స్తుతించి నే పాడెదా - స్తోత్రగీతమును

హర్షించి నే పాడెదా - నా పూర్ణ హృదయముతో (2)

 హల్లెలూయ అని పాడెదా - నా యేసుని స్తుతించెద (2)


1.   కృంగిన వేళలలో నాకు -   శక్తినిచ్చును

    నలిగిన వేళలలో నన్ను - ఆదరించును (2)

 నా విమోచకుడు యేసయ్యా -  నాకు విడుదలను ఇచ్చును

 నా ఆశ్రయము యేసయ్య -  నాకు నెమ్మదిని ఇచ్చును (2)



2. ఉన్నతమైన నామము - నా యేసుని నామము

 మహిమ గల నామము - నా యేసుని నామము (2)

 యేసు నామము ఘనపరచినా -  నన్ను  ఘనపరచును యేసయ్య

 యేసు నామము స్తుతించినా -  గొప్ప కార్యములు జరుగును (2)



3. మరణమందైనను - శ్రమలలో నైనను

వ్యాధిలో నైనను - బాధలోనైనను (2)

నన్ను విడువని యేసయ్య  -  యెడబాయని మెస్సయ్య

 నన్ను కాపాడును యేసయ్య  - నన్ను రక్షించును యేసయ్య  (2)

Post a Comment

0 Comments