Sruthichesi ne padana - శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

 శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)      ||శృతిచేసి||

దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||

Post a Comment

0 Comments