Ninnu talachi nanu nenu marachi - నిన్ను తలచి నను నేను మరచి

 నిన్ను తలచి నను నేను మరచి 

నీ సాక్షిగా ఇల నే బ్రతుకు చుంటిని “2”
యేసయ్యా .... నీ కృప లేక నే బ్రతుకలేనూ ...... నా “2”
                                              నిన్ను
జీవములేని దైవారాధనలో 
నిర్జీవక్రియలతో మృతుడనైతిని “2”
జీవాధిపతివై నా జీవితానికి 
నిత్యజీవమనొసగిన యేసయ్యా “2” 
                                          “నిన్ను”
దారేతెలియని కారుచీకటిలో 
బ్రతుకే భారమై నలిగిపోతిని “2”
నీతి సూర్యుడ ఎదలో ఉదయి౦చి 
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా “2”
                                          “నిన్ను”
సద్గుణ శీలుడా సుగుణాలు చూచి 
హృదిలో నేను మురిసిపోతిని “2”
సుగుణాలు నాలో చూచుటకే నీవు 
సిలువలో నాకై నలిగిన యేసయ్యా “2” 
                                          “నిన్ను”

Post a Comment

0 Comments