Prema yesuni Prema - ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

  • నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది

  • ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
  • ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ             ||ప్రేమ||

  • తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
  • కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును                        ||ఎన్నడెన్నడు||

  • భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
  • వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును   ||ఎన్నడెన్నడు||

  • బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
  • నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును        ||ఎన్నడెన్నడు||

  • ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
  • క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును        ||ఎన్నడెన్నడు||

Post a Comment

0 Comments