Nibbaram kaligi dairyamugundu - నిబ్బరం కలిగి ధైర్యముగుండు

 నిబ్బరం కలిగి ధైర్యముగుండు

దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)

నిన్ను విడువడు నిన్ను మరువడు

ప్రభువే నీ తోడు

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము

నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా       నిబ్బరం


పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)

ప్రభు కృప మమ్మును విడువడుగా (2)

ఎక్కలేని ఎత్తైన కొండను

ఎక్కించును మా ప్రభు కృప మమ్మును

ప్రభువే మా బలము         హల్లెలూయా


మునుపటి కంటెను – అధికపు మేలును (2)

మా ప్రభు మాకు కలిగించును (2)

రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును

శత్రువు ఎదుటనే భోజనమిచ్చును

ప్రభువే మా ధ్వజము       హల్లెలూయా


మా అంగలార్పును – నాట్యముగా మార్చెను

బూడిద బదులు సంతోషమిచ్చెను (2)

దుఃఖ దినములు సమాప్తమాయెను

ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను

ప్రభునకే స్తోత్రం      హల్లెలూయా


స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)

మా ప్రభు మమ్మును మరువడుగా (2)

చూడుము నా అరచేతిలనే

చెక్కితి నిను అన్నాడు ప్రభువు

ప్రభువే చూచుకొనును      హల్లెలూయా


రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)

మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)

ఇదిగో నేనొక నూతన క్రియను

చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను

ఇప్పుడే అది మొలుచున్      హల్లెలూయా


మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)

మా ప్రభు మాకు అందించును (2)

ప్రాకారముగల పట్టణములోనికి

ప్రభువే మమ్మును నడిపింపచేయును

ప్రభువే మా పురము         హల్లెలూయా

Post a Comment

0 Comments