శక్తి చేతనైనను - బలము చేతనైనంత

 పల్లవి :- 

శక్తి చేతనైనను - బలము చేతనైనంత 

మావలన కాదయ్యా - యేసయ్యా " 2 "

నీ ఆత్మ చేతనే - జరిగించినావయ్యా 

నీ కార్యములన్నిటిని - నీవయ్యా " 2 " 

అందుకే వందనం - అందుకో మా వందనం  " 2 " శక్తి చేతనైనను "


1వ చరణం :-

మోషేను పిలిచావూ - నీ శక్తితొ నింపావూ 

ఫరొ రాజుకే నీవూ - ధేవునిగా చేసావూ " 2 "

అటులనే … అటులనే 

నీ దాసులకు కూడా - నీ శక్తి నీయుమయ్యా  

నీ ఆత్మతో నింపుమయ్యా 

 " శక్తి చేతనైనను " 


2వ చరణం :- 

దావీదును కోరావూ - అభిషేకం చేసావూ 

గల్యాతును హతమార్చ - నీ శక్తిని నొసగావూ " 2 " 

అటులనే … అటులనే 

ఈ లోక గొల్యాతును - గెల్వ శక్తి నీయుమయ్యా  

తైలమతొ - తడుపుమయ్యా 

 " శక్తి చేతనైనను " 


3వ చరణం :-

అలనాడు కట్పించెను - సొలోమోను మందిరమును 

ఆ మందిరములోనా - నీ మనసు నిలిపావూ  " 2 "

అటులనే … అటులనే 

ఈ మందిరములోనా - ని మనసు ఉంచుమయ్యా 

నీ ద్రుష్టి - నిలుపుమయ్యా

" శక్తి చేతనైనను " 



Post a Comment

0 Comments