ఏమిచ్చి నీ ఋణము – తీర్చుకొందును

 పల్లవి:      ఏమిచ్చి నీ ఋణము – తీర్చుకొందును

      ఏమి చేసి చాలని  నేను ఊరుకొందును     (2)

      ఏమి చేసినా   ఎంత చేసినా 

అది కొంచమే  అవుతుందయ్య

నీవు చేసిన  మేలులకు           (2

అ. ప: ఓ యేసయ్య ఈ బ్రతుకు నీదయ్యా 

      నీ సేవయే  నా శ్వాస యేసయ్య          (2)

1.     ఎన్నికే లేని నన్ను ఎన్నుకున్నావయ్య 

కొలతలే లేని  ప్రేమ  కుమ్మరించినావయ్య    (2)

కరుణచూపి కనికరించికాచినావు యేసయ్య   (2)“ఓయేసయ్య

2.    మాట వినకపోయినా  నన్ను మారువలేదయ్య 

ఎంతగా విసిగించిన – విసిరివేయలేదయ్య     (2)

చేరదీసి సరిగచేసి  సేవనిచ్చినావయ్యా       (2)“ఓయేసయ్య

3.    నా ఊపిరి నీవై  నన్ను నిలిపావయ్య 

నీ సాక్షిని నేనై  ఇలలో జీవింతును   (2)

ఊరక నేనుండక  ఊపిరివున్నంతవరకు      (2)“ఓయేసయ్య

Post a Comment

0 Comments