మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

 పల్లవి:.   మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -  నా జీవిత ధన్యతైయున్నది

1. మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు (2x)

మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు

...మహోన్నతుడా...


2. ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా (2x)

 జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా

...మహోన్నతుడా...


3. వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా (2x)

వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా

...మహోన్నతుడా

Post a Comment

0 Comments