దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని

పల్లవి: దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్నిస్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||


1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని. ||దీవించావే సమృద్ధిగా||


2. కొలతలే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృ ద్ధి జీవితం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగా నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||

Post a Comment

0 Comments