యేసయ్య నీ ప్రేమ నా సొంతము

 యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము

యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము

ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము

ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం     యేసయ్య

ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు

నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు

నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు

నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం

నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి

నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ     యేసయ్య

ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు

లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే

నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా

పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం

సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు

మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు     యేసయ్య

Post a Comment

0 Comments