పల్లవి: సిలువలో గాయాలతో
ఆ సిలువలో పంచగాయాలతో
రక్తాన్ని కార్చితివా...
మాకోసం బలియైతివా...
యేసయ్యా... యేసయ్యా...
1. తండ్రి వీరు చేయునదేమో
వీరే ఎరుగరు క్షమించమని
నాకోసం ప్రార్థించితివా...
నాకోసం బలియైతివా...
యేసయ్యా... యేసయ్యా...
2. పాపములో శాపముతో
నశించి పోతున్న నా కోసము
రక్తాన్ని కార్చితివా...
రక్షణ నిచ్చితివా...
యేసయ్యా... యేసయ్యా...
3. పాపినైన నన్ను స్నేహితుడని పిలిచావు
ప్రాణమియ్య నాకోసం వెనుతీయలేదు
అర్పింతును నా జీవితము...
జీవింతును...నీకోసమే
యేసయ్యా... యేసయ్యా...
0 Comments