ప్రేమించి నన్ను నా ప్రియ యేసు నీ ప్రేమలోనే నడిపించినావు

 ప్రేమించి నన్ను నా ప్రియ యేసు

నీ ప్రేమలోనే నడిపించినావు  

దర్శించి  నన్ను దీవించినావు

కరుణించి నన్ను కాపాడినావు  

ఏ రీతి నిన్ను సేవింతునయ్యా

నా  యేసు నిన్నే పూజింతునయ్యా 


1. మార్గము నీవే  - క్షేమము నీవే  -  చల్లగ చూసే - దేవుడ నీవే  

ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే -  అణువణువంతా

నీ  కృపలోనే - నా బలమంతా  - కాపరి నీవే ప్రభూ

నీ దయలోనే -  జీవితమంతా  -  నా గురి నీవే ప్రభూ

నా గురి నీవే ప్రభూ


2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా  

వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా

ఉన్నతమైన  - నీ ఘనకార్యం - ఏమని వివరింతును

ఆశ్రయమైన - నీ సన్నిధానం  - ఎంతటి నా భాగ్యము

ఎంతటి నా భాగ్యము

Post a Comment

0 Comments