నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా

పల్లవి:  నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా 

             నా ఆరాధనకు  నీవే యోగ్యుడవయ్యా  ...నా స్తుతి... 


1. నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము  

నీ వాక్యమే నా పాదములకు దీపము (2x) ...నా స్తుతి... 

2. నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము  

నీ కృపయే నా జీవన ఆధారము (2x) 
...నా స్తుతి... 

3. నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము  

నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2x) 
...నా స్తుతి...

Post a Comment

0 Comments