అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె

అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె 

పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు (2)

కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని

కృతజ్ఞతతో స్తుతించెదను (2)


షారోను రోజా ఆయనే లోయ పద్మమును ఆయనే

అతిపరిశుద్ధుడు ఆయనే పదివేలలో అతిశ్రేష్టుడు (2) 


పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించెగా

నింద శ్రమ సంకటంలో నను సుగంధముగా చేయున్ (2) 


మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా

లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి (2)

Post a Comment

0 Comments