ఆధారమా నా యేసయ్య ఆలించుమా నా ప్రార్ధన

ఆధారమా  నా యేసయ్య 
ఆలించుమా నా ప్రార్ధన 
మదిలోని ప్రతి భారం - మనసార పాడే  మౌన గీతం 
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన 

1. ఏది గెలుపు - ఏది మలుపు 
తలచి చూడ - నిదుర రాదే 

ఓటమైన - ఒంటరైన 
కరుణ చూపి - నడిపినావు 

వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా 
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా 
దీవెనలతో నింపవా 

2. నీదు వదనం - కాంతి కిరణం 
కనులలోని - ప్రేమ మధురం 

ఎదురు చూసే - జీవ గమనం 
బదులు పంపే   - సిలువ రుధిరం 

కడలిలోన - కరముచాపి  -  ఆదరించే   దైవమా 
దీనురాలి - దరికిచేరి -  దీవెనలతో నింపవా 
దీవెనలతో నింపవా

Post a Comment

0 Comments