Tallila laalinchunu tandrila -తల్లిలా లాలించును తండ్రిలా

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||


తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||


పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||

Post a Comment

0 Comments