Junte tene daaralakanna - జుంటి తేనె ధారల కన్న

జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2)     జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటి తేనె||

యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)                   నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటి 3 ||

యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)                                  నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటి

యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నేను మార్చి (2)                              నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటి 3||

Post a Comment

0 Comments