Nee Krupa naaku chalayya Naa yesayya - నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా

 పల్లవి:నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా                                                 నీ కృపలను తలపోయుచూ జీవించెదనయ్య (2)                          కష్టములోనైనా కలిమిలోనైనా                                                         శోధనలోనైనా సౌఖ్యములోనైనా (2)

యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా

యేసయ్యా యేసయ్యా నీవెంటే నేనయ్యా (2) నీ కృప నాకు 


చరణం:1-

వేలకొలది వెండి బంగారు నాణెములా కంటే నీ వాక్యమే నాకు విలువైనది

విస్తారమైన సిరి సంపదల కంటే నీ సేవయే నాకు ఘనమైనది (2)

ఆత్మల భారముతో ఆత్మాభిషేకముతో (2)

అంతము వరకు నీ సేవలో సాగెదన్ (2) యేసయ్య….


చరణం:2-

నీ సంఘ క్షేమమే నా ప్రాణము అది నాకు ఇల ఎంతో భాగ్యము

నీ సేవ కొరకే ఈ జీవితం కరువైన బరువైన నీకంకితం (2)

లెక్కను అప్పగించే ఆ శుభ తరుణంలో నీకు (2)

నమ్మకమైన మంచి దాసుడా అని పిలుపే చాలు (2) యేసయ్య….

Post a Comment

0 Comments