Guduleni guvvala dari tappithi - గూడు లేని గువ్వలా దారి తప్పితి

 పల్లవి: గూడు లేని గువ్వలా దారి తప్పితి                                 గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)                       నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా (2)                నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||

1) గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2) నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా ||

2) చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2) నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

Post a Comment

0 Comments