Krupamayuda ni lona - కృపామయుడా నీలోనా

 కృపామయుడా - నీలోనా  నివసింప జేసినందున (2)        ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా...


ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2)         నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2)                                                        [కృపామయుడా]

చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2)[కృపామయుడా]

నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2).         నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2)

[కృపామయుడా]

ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2)                నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) [కృపామయుడా]

Post a Comment

0 Comments