Sumadura swaramula ganaalatho - సుమధుర స్వరముల గానాలతో

 పల్లవి: సుమధుర స్వరముల గానాలతో                          వేలాది దూతల గళములతో                  కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా  [2]

మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం[2].             |సుమధుర|


చరణం:ఎడారి త్రోవలో నే నడచిన 

ఎరుగని మార్గములొ నను నడిపిన 

నా ముందు నడచిన జయవీరుడా 

నా విజయ సంకేతమా  [2]

{నీవే నీవే నా ఆనందము 

నీవే నీవే నా ఆధారము 

నీవే నీవే నా ఆనందము

నీవే నా ఆధారము } [1]

                                 |సుమధుర|  


చరణం:

{సంపూర్ణమైన నీ చిత్తమే 

అనుకూలమైన సంకల్పమే 

జరిగించుచున్నావు నన్ను విడువక 

నా ధైర్యము నీవెగా } [2]

{నీవే నీవే నా జయగీతము 

నీవే నీవే నా స్తుతిగీతము 

నీవే నీవే నా జయగీతము

నీవే నా స్తుతిగీతము } [1]

                                  |సుమధుర| 


చరణం:

{వేలాది నదులన్ని నీ మహిమను 

తరంగపు పొంగులు నీ బలమును 

పర్వత శ్రేణులు నీ కీర్తినే 

ప్రకటించుచున్నవేగా } [2]

{నీవే నీవే నా అతిశయము 

నీకే నీకే నా ఆరాధనా 

నీవే నీవే నా అతిశయము 

నీకే నా ఆరాధనా } [1]

                               |సుమధుర|

Post a Comment

0 Comments