Deva nannu parishilinchumu - దేవా నన్ను పరిశీలించుము!

 పల్లవి: దేవా నన్ను పరిశీలించుము!

దేవా నన్ను పరీక్షించుము! దేవా నన్ను పరిశీలించుము! నా దేవా నన్ను పరీక్షించుము! నా అంతరింద్రియములను - నా హృదయమును - పరిశోధించుము! పరిశోధించుము! (దేవా) 1. నీ సత్యము ననుసరించి నడుచుకొనుటకై నిర్దోషని నా చేతులు కడుగుకొనుటకై (2) భక్తిహీనులతో... భక్తిహీనులతో సాంగత్యం చేయను! వేషధారులతో పొందు చేయను! నీ బలిపీఠం చుట్టూ... ప్రదక్షిణం చేయుచుందును! ప్రదక్షిణం చేయుచుందును! (దేవా) 2. పాపులతో నా ప్రాణము చేర్చకుండుటకై నీ ఆశ్చర్య కార్యములను వివరించుటకై (2) సమభూమిలో నా పాదం... సమభూమిలో నా పాదం నిలుపుకొందును! సమాజములలో నీనామము కీర్తించెదను! నా కన్నుల యెదుట... నీ కృపను ఉంచుకొనెదను! నీ కృపను ఉంచుకొనెదను! (దేవా)

Post a Comment

0 Comments